Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగుక్రీడలుఆసియా కప్‌ తొలి మ్యాచ్‌కు టీమిండియా రెడీ

ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌కు టీమిండియా రెడీ

టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత్‌ ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి సారించింది. బుధవారం యూఏఈతో తొలి మ్యాచ్‌ ఆడుతూ టైటిల్‌ వేటను ఆరంభించబోతోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఆదివారం పాకిస్థాన్‌తో కీలక పోరు ఉండడంతో యూఏఈ మ్యాచ్‌ను రిహార్సల్‌గా భావిస్తోంది. గంభీర్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం పెరిగింది. హార్దిక్‌, అక్షర్‌తో పాటు శివమ్‌ దూబేను ఆడించే అవకాశం ఉంది. దీంతో కుల్దీప్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితం కావచ్చు.

కీపర్‌గా జితేశ్‌ శర్మకు అవకాశమిచ్చేలా కనిపిస్తోంది. గిల్‌ జట్టులో చేరడంతో శాంసన్‌ ఓపెనర్‌ స్థానం కోల్పోయాడు. మిడిల్‌ఆర్డర్‌లో తిలక్‌, సూర్య, హార్దిక్‌ కీలకం కానున్నారు. పేసర్లలో బుమ్రా, అర్ష్‌దీప్‌ ప్రధాన బలంగా నిలుస్తారు.

యూఏఈ కోసం ఇది పెద్ద సవాలు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం, గిల్‌, సూర్య వంటి స్టార్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ చేయడం వారికిది అరుదైన అవకాశం. వసీమ్‌, రాహుల్‌, సిమ్రన్‌జీత్‌లపై యూఏఈ ఆధారపడుతోంది. కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ భారత్‌కు గట్టి పోటీనివ్వాలని విశ్వాసం వ్యక్తం చేశారు.

అంచనా జట్లు
భారత్‌: గిల్‌, అభిషేక్‌, తిలక్‌, సూర్య (కెప్టెన్‌), జితేశ్‌, హార్దిక్‌, శివమ్‌ దూబే, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, వరుణ్‌.
యూఏఈ: వసీమ్‌ (కెప్టెన్‌), షరాఫు, రాహుల్‌, ఆసిఫ్‌, ఫరూఖ్‌, హర్షిత్‌, సిమ్రన్‌జీత్‌, జవదుల్లా, హైదర్‌, సిద్దిఖీ, రోహిద్‌.

పిచ్‌ రిపోర్ట్‌
దుబాయ్‌ పిచ్‌ ప్రస్తుతం పచ్చికతో ఉండటంతో పేసర్లకు సహకరించే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular