ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన మంత్రి జన్మాన్ (PM JANMAN) రహదారి అనుసంధాన భాగం కింద ఇప్పటి వరకు 206 రహదారులకు ప్రతిపాదనలు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు రహదారి, 27 లాంగ్ స్పాన్ బ్రిడ్జిల (LSBs) ప్రతిపాదనను ఎపి గవర్నమెంట్ ఎమ్.ఐ.ఎస్. (Management Information System) లో నమోదు చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు కలిసి పార్లమెంట్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు
ప్రధాన్ మంత్రి జన్మాన్ కింద రహదారి అనుసంధానం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) అమలు చేస్తోందని తెలిపారు. ప్రత్యేకంగా హేతుబద్ధ గిరిజన గుంపులు (Particularly Vulnerable Tribal Groups) వుండే ప్రాంతాల్లో 2023-2024 ఏడాదిలో 315.538 కిమీ పొడవు రహదారికి, 130 రహదారి పనులు మంజూరు కాగా, రూ.280.53 కోట్లు, 2024-2025 లో 297.180 కిమీ పొడవు రహదారికి 76 రహదారి పనులు మంజూరు కాగా, రూ.275.07 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా ఎపిలో 612.718 కిమీ పొడువు రహదారికి 206 రహదారి పనులు మంజూరు కాగా, అందుకు రూ.555.60కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అలాగే పిఎమ్-జన్మాన్ కింద మంజూరైన రహదారి పనుల పనితీరును పరిశీలించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) ద్వారా ఎటువంటి ప్రత్యేక అధ్యయనం చేపట్టలేదన్నారు..