వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వైసీపీ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, “కోర్లు పీకేసినా పాము కాటేస్తుందనేలా వైసీపీ ప్రవర్తిస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అనే “విషసర్పం” కోరలు పీకేసినా, ఆ పార్టీ నిరంతరం విషం కక్కుతూనే ఉందని ఆరోపించారు. యూరియా సరఫరా, ప్రభుత్వ పథకాలు సహా ప్రతి అంశంలోనూ వైసీపీ క్రిమినల్స్ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు, నకిలీ ఆందోళనలు సృష్టిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
ఇటీవల సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరించి, రైతులను హెచ్చరించినట్లుగా మరో ఫేక్ వీడియో సృష్టించారని వివరించారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలను కూడా వైసీపీ వక్రీకరించడం నిందార్హమని విమర్శించారు. ప్రజలంతా ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.




