టాలీవుడ్‌లో ఎప్పుడూ తన మాటలతో, తన స్టైల్‌తో వార్తల్లో నిలిచే నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఆయన తాజాగా చేసిన ఒక పోస్ట్ సినీ వర్గాల్లో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. “కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు… నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు” అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చేశారో ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.
బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. కొంతమంది ఈ ట్వీట్ రాజకీయ కోణంలో ఉందని భావిస్తుంటే, మరికొందరు టాలీవుడ్ లోపలి పరిణామాలకే ఇది సంబంధించినదని అంటున్నారు. గతంలో కూడా ఆయన పలుమార్లు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఆయన, పవన్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగింది. అందువల్ల ఈ పోస్ట్‌ను ఆయన ఎవరికీ ఉద్దేశించారనే ప్రశ్న అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ నిర్మాతగా పలు హిట్ సినిమాలను అందించిన బండ్ల గణేశ్, అప్పుడప్పుడు తన ఓపెన్ స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తారు. ఆయన గతంలో రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య, ప్రతి ట్వీట్ చర్చనీయాంశంగా మారడం సహజమే. ఈసారి కూడా అదే జరిగింది.
ఫిలింనగర్ వర్గాలు అయితే ఈ ట్వీట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఆయన త్వరలోనే వెల్లడిస్తారని అంటున్నాయి. ఎవరిపైనో కసిగా, లేక తన అనుభవాలపై ఓపెన్‌గా రాసినా, బండ్ల గణేశ్ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి హాట్ టాపిక్‌గా మారింది.




