Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగుతాజావార్తలునెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ దారుణ హత్య

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ దారుణ హత్య

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఆమెను, స్నేహితుడు నిఖిల్ (Nikhil) రూమ్‌కి పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, మైధిలి ప్రేమను నిరాకరించడంతోనే నిఖిల్ ఈ నేరానికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తమవుతోంది. హత్య అనంతరం నిఖిల్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. మైధిలి ప్రియ మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర షాక్‌కు గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular