Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగుఆరోగ్యండాక్ట్రెస్ ఆధ్వర్యంలో 5 కిమీ పరుగు – డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం

డాక్ట్రెస్ ఆధ్వర్యంలో 5 కిమీ పరుగు – డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జెండా ఊపి పరుగు ప్రారంభించి, అనంతరం గ్లిడా (గ్లోబల్ ఇండియన్ డాక్టర్స్ అలయన్స్) యాప్ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “డ్రగ్స్ వినియోగాన్ని ప్రభుత్వం కఠిన చర్యలతో అణచివేస్తోంది. యువత భవిష్యత్తు కోసం ఈ మాదక ద్రవ్యాలను దూరం పెట్టాలి. డాక్ట్రెస్ నిర్వహించిన ఈ అవగాహన పరుగు ఎంతో అభినందనీయమైనది. ఇలాంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలోనూ నిర్వహిస్తే డ్రగ్స్ అనే మహమ్మారిని పారద్రోలవచ్చు. నేను ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తాను” అన్నారు.

కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ శ్రీకీర్తి శశి మరియు ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ, “డ్రగ్స్ వ్యతిరేక అవగాహనతో పాటు, వైద్యులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడమే మా ఉద్దేశ్యం. అలాగే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కూడా సమాజంలో చైతన్యం కలిగించాలని ఈ రన్ ఏర్పాటు చేశాం” అని తెలిపారు.

కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, నార్కోటిక్స్ బ్యూరో అధికారి వడ్డే నవీన్, స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ కొలను జగ్జీవన్ రెడ్డి, అనేక ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.

“డ్రగ్స్ వద్దు – నవసమాజమే ముద్దు” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. యువత ముందుకు వచ్చి మాదక ద్రవ్యాలపై యుద్ధం చేయాలని వైఎల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

పరుగు ముగిసిన అనంతరం పాల్గొన్న వారికి డాక్ట్రెస్ సంస్థ తరఫున మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular