ఓల్డ్ మల్కాజ్గిరిలో పాడైపోయిన పవర్ బోర్‌ను మరమ్మతు చేయించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సునీల్ యాదవ్.ఈ సందర్భంగా బోర్ పనితీరును పరిశీలించిన కార్పొరేటర్, బస్తీ వాసులతో సమావేశమై నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. మంచి నీటి సరఫరా సమయాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.బోర్ మరమ్మత్తులు పూర్తవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో సుగుణమ్మ, సతీష్, రాంలీల, కళావతి, లక్ష్మి, స్వప్న, రాంబాబు, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.