Saturday, June 20, 2026

Creating liberating content

 নিট পরীক্ষার্থীদের সুবিধায় শিয়ালদহে...

আগামী রবিবার অনুষ্ঠিত হতে চলেছে দেশের অন্যতম গুরুত্বপূর্ণ প্রবেশিকা পরীক্ষা NEET (National Eligibility...

బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు...

చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర...

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా...

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా....

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో...

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి...
Homeతెలుగుఆరోగ్యంయోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు...

యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో రామ్ దేవ్ బాబా చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. గత 30 ఏళ్లుగా రామ్ దేవ్ బాబాతో తనకు పరిచయం ఉందని, వేలాది మంది ఆయన వద్ద యోగా శిక్షణ పొందుతున్నారని తెలిపారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన 6-7వ శతాబ్దానికి చెందిన ఉండవల్లి గుహల వద్ద యోగాసాధన నిర్వహించడం ప్రత్యేకమని పేర్కొన్నారు. అమరావతిని దేవతల రాజధాని స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ప్రపంచంలోని అనేక దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుంటూనే ఆధ్యాత్మికత, యోగా ద్వారా సమతుల్య జీవన విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. యోగా శరీరం, మనసును అనుసంధానం చేస్తుందని, ప్రస్తుత తరానికి యోగాసాధన అలవాటు చేస్తే ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించినట్లవుతుందని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం కోసం చర్యలు తీసుకుంటున్నామని, 20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యం కోసం అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమంలో యోగా, ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇస్తూ రోగ చికిత్స కంటే రోగ నివారణపై దృష్టి సారిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి:శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, కానీ తెలంగాణలో దీనిని...

పాటల దేవుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం స్పెషల్ స్టోరీ

1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో ఒక చిన్న శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి ఎస్.పి. సమ్మయ్య హరిదాస కీర్తనకారుడు, తల్లి శకుంతలమ్మ ఆధ్యాత్మికత కలిగిన గృహిణి. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగిన SPBకి గానం మధుర మాయాజాలంగా మారింది. చిన్నతరహా...

అర్ష్‌దీప్‌ను అందుకే తీసుకోలేదు

ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంచనాల ప్రకారం అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని భావించినా, అతనికి చోటు దక్కలేదు. కేవలం ఒకే ఒక్క ప్రధాన పేసర్‌తో టీమిండియా బరిలోకి దిగడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.