తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ప్రముఖులు స్వయంగా కలిసి విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే విజయ్‌కు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష నుంచి శుభాకాంక్షలు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పే త్రిష ఈసారి మౌనంగా ఉండటంతో అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో విజయ్, త్రిష మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య స్నేహం దూరమైందంటూ పలు రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారనే ప్రచారం కూడా మరింత చర్చకు దారితీసింది.అయితే ఈ పుకార్లన్నింటికీ త్రిష ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చారు. విజయ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.“ప్రతిదాన్నీ సార్థకం చేసే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ త్రిష తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రెడ్ హార్ట్ ఎమోజీతో పాటు ప్రత్యేకమైన సందేశాన్ని జోడించారు. ఆ ఫొటోలో విజయ్ చిరునవ్వుతో కనిపిస్తుండగా, త్రిష ఆయనను చూస్తూ నవ్వుతూ కనిపించారు. విజయ్ ముందు పుట్టినరోజు కేకులు కూడా ఉండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.ఈ ఫొటో తాజాగా తీసుకున్నదా లేదా గతంలో తీసుకున్నదా అనే విషయంపై స్పష్టత లేకపోయినా, విజయ్‌కు త్రిష చెప్పిన విషెస్ మాత్రం అభిమానులను ఆనందానికి గురిచేశాయి. ఆలస్యంగా స్పందించినప్పటికీ పుకార్లకు చెక్ పెట్టారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ ఫొటో, ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్, త్రిష అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


