Saturday, June 20, 2026

Creating liberating content

బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు...

చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర...

యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం:...

అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి...

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా...

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా....

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో...

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి...
Homeతెలుగుఆరోగ్యంప్రపంచానికి యోగాను అందించిన...

ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానిదే: ఎంపీ ఈటల రాజేందర్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవ సంబంధాల విలువలను అందించిన గొప్ప దేశం భారతదేశమని అన్నారు. ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందిన భారతదేశాన్ని తిరిగి అదే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని తెలిపారు.

భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఈటల అన్నారు. ఐక్యరాజ్యసమితిలో యోగా దినోత్సవానికి ప్రతిపాదన చేసి, యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని తెలిపారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను అనుసరిస్తుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, యువతతో పాటు అన్ని వయసుల వారు యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో వరుసగా ఏడోసారి భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి సీతక్క

చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ (NIMSME)లో మిషన్ వాత్సల్య, సాక్ష్యం అంగన్వాడి,...

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డా. కె. లక్ష్మణ్ నియామకం.. శుభాకాంక్షలు తెలిపిన క్యానం రాజ్యలక్ష్మి

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ను వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డా. కె. లక్ష్మణ్‌కు లభించిన ఈ ప్రతిష్టాత్మక బాధ్యత ఆయన సుదీర్ఘ...

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.