Wednesday, June 24, 2026

Creating liberating content

তারাতলা বিপর্যয়ের পর কলকাতায়...

তারাতলার নির্মীয়মাণ গুদামের ছাদ ধসে প্রাণহানির ঘটনার জেরে বড়সড় প্রশাসনিক সিদ্ধান্ত নিল রাজ্য...

ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల...

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి...

మంగళగిరిలో సందడి చేసిన రామ్...

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే...

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...
Homeతెలుగుతాజావార్తలువర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద...

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు ముందస్తు చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద రక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత రాకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా పశుగ్రాసాల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్” (పీఎండీఎస్) అవగాహన కరపత్రాలను మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంతో పాటు పశుసంపదపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, పశుపోషకులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రకృతి వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా మంచి పశుగ్రాస దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. పచ్చిమేత ఉత్పత్తి, పశుగ్రాస నిల్వ, తాగునీటి సదుపాయాలు, పశువుల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు.గ్రామ స్థాయిలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ఈ కరపత్రాలను రైతులు, పశుపోషకులకు పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని, దాని పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతులు, పశుపోషకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పశుసంపదను సమర్థవంతంగా రక్షించుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు, శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ప్రముఖులు స్వయంగా కలిసి విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే విజయ్‌కు అత్యంత...

శ్రీవాణి దర్శన టికెట్లలో సమయం తప్పు..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300 మంది భక్తులు గందరగోళానికి గురయ్యారు. అయితే టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఊరట లభించింది.వివరాల్లోకి...

జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గణేష్ భారి సమర్పణలో, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై రూపొందిన...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.