నకిలీ పత్రాలతో రూ. 6 కోట్ల రుణం తీసుకున్న ఇద్దరిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ నారాయణ, రవి నెక్నాంపూర్‌లో లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి రుణం పొందారు.
రుణం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని బయటపడింది. విచారణలో నిందితులు ఆ రుణాన్ని ప్రైవేట్ కంపెనీలకు, నారాయణ భార్య వ్యక్తిగత ఖాతాకు మళ్లించినట్లు తెలిసింది.
ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నారాయణ, రవిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.




