Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగునేపాల్‌లో అల్లర్లు: 20 మంది మృతి, ప్రధాని రాజీనామా

నేపాల్‌లో అల్లర్లు: 20 మంది మృతి, ప్రధాని రాజీనామా

నేపాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా, యువత ఆందోళనలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. 26 యాప్‌ల (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితరాలు)పై నిషేధం యువతకు నచ్చకపోవడంతో రోడ్లపైకి భారీ సంఖ్యలో వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో హింస చెలరేగి, ఇప్పటివరకు 20 మంది మృతిచెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

కాట్మండులో పార్లమెంట్ భవనం, మాజీ ప్రధాని, హోం మినిస్టర్ నివాసాలపై దాడులు జరిపారు. ఫలితంగా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఇండిగో విమానాలు రద్దు కాగా, ట్రిబ్యూన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ పరిణామాల నడుమ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ప్రస్తుతం భద్రతా బాధ్యతలు నేపాల్ ఆర్మీ చేపట్టి, నిరసనకారులను చర్చలకు రావాలని పిలుపునిస్తోంది. అయితే, దేశంలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular