హైదరాబాద్ నగరం లో వర్షం దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రహదారులు జలమయమయ్యాయి. అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, చార్మినార్, మాధాపూర్ సహా అనేక ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగించగా, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై మాన్సూన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పౌరులు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారాలు విజ్ఞప్తి చేస్తున్నారు
హైదరాబాద్ లో భారీ వర్షం
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


