ఎన్టీఆర్ జిల్లా లోని 295 గ్రామాల సమగ్ర అభివృద్ది కోసం, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక పురోగతి కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం హైదరాబాద్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (NIRDPR) సంస్థ డైరెక్టర్ జనరల్ జి.నరేంద్రతో సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి, జిల్లాలోని 295 గ్రామాలు, పట్టణ ప్రాంతాలు మొత్తం కలిపి అభివృద్ధి చేయడానికి అవసరమైన అంశాలతో పాటు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి. నాణ్యమైన ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయించాలి. ఇందుకు వారి ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు గురించి, వాటి నిర్వహణ, విధివిధానాలపై కూలంకుషంగా చర్చించుకున్నారు. అదే విధంగా ఏ ప్రాంతాల్లో ఏ యూనిట్ పెడితే బాగుంటుందనే విషయం కూడా చర్చ సాగింది.
డైరెక్టర్ జనరల్ జి.నరేంద్ర మాట్లాడుతూ గ్రామీణాభివృద్ది కోసం సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలను జిల్లాలో ఎంపీ కేశినేని శివనాథ్ ముందుకు తీసుకువెళుతున్నందుకు అభినందనలు తెలిపారు. అలాగే దేశంలోనే ఎన్టీఆర్ జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ డాక్టర్ ఎమ్.డి. ఖాన్, ప్రోఫెసర్స్ డాక్టర్ కతిరేషన్, డాక్టర్ ఎ.కె.బాంజా, డాక్టర్ సంధ్య గోపాలన్, డాక్టర్ జ్యోతి మహంతి, డాక్టర్ నిత్య లతో పాటు కేశినేని ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కోసం ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
Get notified whenever we post something new!
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


