Wednesday, June 24, 2026

Creating liberating content

তারাতলা বিপর্যয়ের পর কলকাতায়...

তারাতলার নির্মীয়মাণ গুদামের ছাদ ধসে প্রাণহানির ঘটনার জেরে বড়সড় প্রশাসনিক সিদ্ধান্ত নিল রাজ্য...

ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల...

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి...

మంగళగిరిలో సందడి చేసిన రామ్...

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్...

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు...

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద...
Homeతెలుగుతాజావార్తలువిజయ్‌కు త్రిష స్పెషల్...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ప్రముఖులు స్వయంగా కలిసి విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే విజయ్‌కు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష నుంచి శుభాకాంక్షలు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పే త్రిష ఈసారి మౌనంగా ఉండటంతో అభిమానుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో విజయ్, త్రిష మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య స్నేహం దూరమైందంటూ పలు రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారనే ప్రచారం కూడా మరింత చర్చకు దారితీసింది.అయితే ఈ పుకార్లన్నింటికీ త్రిష ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చారు. విజయ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.“ప్రతిదాన్నీ సార్థకం చేసే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ త్రిష తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రెడ్ హార్ట్ ఎమోజీతో పాటు ప్రత్యేకమైన సందేశాన్ని జోడించారు. ఆ ఫొటోలో విజయ్ చిరునవ్వుతో కనిపిస్తుండగా, త్రిష ఆయనను చూస్తూ నవ్వుతూ కనిపించారు. విజయ్ ముందు పుట్టినరోజు కేకులు కూడా ఉండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.ఈ ఫొటో తాజాగా తీసుకున్నదా లేదా గతంలో తీసుకున్నదా అనే విషయంపై స్పష్టత లేకపోయినా, విజయ్‌కు త్రిష చెప్పిన విషెస్ మాత్రం అభిమానులను ఆనందానికి గురిచేశాయి. ఆలస్యంగా స్పందించినప్పటికీ పుకార్లకు చెక్ పెట్టారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ ఫొటో, ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్, త్రిష అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు ముందస్తు చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద రక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత రాకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రకృతి...

శ్రీవాణి దర్శన టికెట్లలో సమయం తప్పు..

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీ సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై దర్శన సమయం తప్పుగా ముద్రించడంతో సుమారు 300 మంది భక్తులు గందరగోళానికి గురయ్యారు. అయితే టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఊరట లభించింది.వివరాల్లోకి...

జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు “చెట్టు మీద దెయ్యం నాకేం భయం”

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త హారర్, సస్పెన్స్ అనుభూతిని అందించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. భయం, ఉత్కంఠ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన “చెట్టు మీద దెయ్యం నాకేం భయం” చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గణేష్ భారి సమర్పణలో, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్‌పై రూపొందిన...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.